Tuesday, April 22, 2008

24వ సర్గ

మెత్తటి పరుపుల సౌఖ్యమునందుము
మా రాజును భర్తగ త్వరగ పొందుము
ఈ మూడు లోకములను నీవే ఏలుము
అడవుల బడి తిరిగెడి రాముని
నీ మనము నుండి తీసి వేయుము
అనుచు క్రోధమున సీతపై అరచిరి
భయమున గజగజ వణికెడి స్వరమున
జలజల కారెడి కన్నులు తుడుచుచు
వారిని చూసి శక్తిని పూంచి
చిన్నగ సీత ఇట్లు పలికెను
"నిర్దయగా నాపై పలికిన
కఠిన వాకులు మీకు పాపము గాదా?
మానవ కాంతను, రావణు పతిగా
కలలోనైనా నా ఊహకు రాదు
మీ ఇచ్చము వచ్చిన రీతిలొ నాకు
శిక్షను వేయుము, విందుగ తినుము
రాజ్యము లన్ని పోయిన గాని
అడవున నిప్పుడు తిరిగిన్‌అగానీ
రాముడె నాకు మనమున నిండెను
సువర్చల వేచెను సూర్యుని కొరకై
ఇంద్రుని కొరకై శచియు వేచెను
వశిష్టుని కొరకై అరుంధతి నిలిచెను
చంద్రుని కొరకై రోహిణి వగచెను
అగస్త్యుని కొరకై లోపాముద్రయు
సుకన్యేమొ చవణుని కోరెను
సావిత్రేమొ సత్యవంతుని
శ్రిమతి నిలచెగా కపిలుని కొరకై
మదయంతేమో సౌదస కొరకై
సగరుని కొరకై కేశిని లేదా
దమయంతేమో వగచెగ నలునికై
అట్లే నేనును రాముని సన్నిధి
నా మదినెప్పుడు ఇచ్చి వేసితి"
సీత చెప్పిన మాటలు విన్నదె
రక్కసి మూకలు వివిధ రీతులతొ
సీతను భయము పెట్ట సాగిరి
ఇంతలొ వినతను ఒక్క రాక్షశి
సీతను చేరి ఈవిధి పలికెను 20
"

"ఓ సీతా రాముని పై గల అమిత ప్రేమను
మాకు ఎల్లరరకు తెలియ చెప్పితివి
అతి ఎప్పుడును వర్జితమన్నది
నీకు తెలిసిన సత్యము కాద
మానవ ధర్మము చక్కగ చేసి
కష్టములెన్నియొ అనుభవించితివి
రావణుబొంది సుఖములు బడయగ
అవకాశము నీకు ఇప్పుడు కలిగెను
దానిని విడువక సుందర్రంగుడును
ఇంద్రుని సముడును రాక్షస రాజును
భర్తగ పొంది ఈ భువినికనేలుము
మానవ మాత్రుడు, కానల తిరిగెడు
రాముని విడువుము శోకము వదులుము
అగ్నికి స్వాహవలె ఇంద్రుని శచివలె
ముల్లోకములకు రాణిగ వెలుగుము
రాజ్యము లేక శౌర్యము జచ్చి
కస్ఠములీదుచు అడవుల తిరుగుచు
విలవిల నేడ్చుచు విలువలు సమసిన
రాముని మరువక ఈవిధి చేసిన
తప్పక నిన్ను తినక మానము"
జారిన స్థనములు మూసిన పిడికిలి
బిగ్గర స్వరముతొ అక్కడ చేరిన
వినతను రాక్షసి సీతతొ నిట్లనె
"ఓ సీత! నీవొక కుమతివి
పరుష భాషణలు ఎన్నోచేసితివి
కనికరమున నిను ఉపేక్షించితిమి
నీ క్షేమము కోరి చెప్పిన ఊసులు
పెడచెవిన నీవు పెట్టుచుంటివి
జలధులు దాటిన తావున నుంటివి
దానిని దాటెడి చావలెవరికిని
ఈజగతిన నేటికినుండుట కల్ల
మా రక్షణ వలయమును బేధించుటకు
ఇంద్రుని కైనా అలవి కాని పని
ఏడ్చుట మానుము నామాట వినుము
బాధలకింక తాళము వేయుము
అదృష్ట ద్వారములు తెరిచి చూడుము
సమయోచితముగ వ్యవహరింపుము
నీ యవ్వనమెంతో కాలము నిలువదు
సమయము త్వరగా మించి పోవును
వచ్చిన అవకాశము చేయిజారును
త్వరపడి సుఖములు పొంది చూడుము
మదిర కన్నుల సుందరీ సీతా!
రావణు గూడి వనములు తిరుగుము
వేలకొలదిగా దాసీ గణముల
సేవలనందెడి భాగ్యముగొనుము
నేను వచించిన మాటలు వినుము
లేనిచొ గుండెను చీల్చి తినగలను" 38

ఇంతలొ చండొదరి అను రాక్షసి
శూలము త్రిప్పుచు అక్కడ చేరి
కోపమున ఊగుతూ పెద్దగ నిట్లనె
"లేడి వలె బెదిరిన చూపులుగల్గి
భయమున అదిరెడి స్తనములుగల్గిన
ఈమెను చూసి నా ఈ మనమున
నోరూరు విధముగ ఆశలు రేగెను
ఈమె గుండె మాంసము కాలేయమును
లోపలి ప్రేవులు తలతో కలిపి ముద్దగ జేశి
విందుగ తినిన మెండుగ నుండును"
"జాగెనుదుకిక గొంతు నులుముడు
మానవ కాంత తనువు వీడెనని
రేడితొ మనము విన్నవించెదమని "
అందుకు ప్రతిగా ప్రఘస పలికెను
ముందు చంపుము సరిగా పంచము
మధ్యము మరియు నంజుకు లేహ్యము
అన్నియు త్వరగా ఇచటకు తెమ్మని
అచటకు చేరిన అజాముఖి పలికెను
విందు ముగిసిన తరువాతందరు
నికుంబిల సన్నిధి నృత్యము చేతమని
అందుకు ప్రతిగా సూర్పణఖ నుడివెను
వివిధ రకములుగ కష్టము కలిగెడి
మాటలు వింటూ సీత వగచెను 48

No comments: